సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘బింబిసార’ తో అతని కెరీర్ లో పెద్ద హిట్ కొట్టాడు. . అందులో అతను ద్విపాత్రాభినయం చేస్తే, ఇప్పుడు అతను త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘అమిగోస్‘ నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూటిగా సుత్తి లేకుండా టాక్ విషయానికి వస్తే.. బాగుంది .. పర్వాలేదు అని వినిపిస్తుంది. అయితే బోర్ మాత్రం కాదు.. ఈ సినిమా లో నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి, తదితరులు నటించగా ప్రతిష్టాకర నిర్మాణసంస్థ మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మించింది. సంగీతం : జిబ్రాన్ అందించడం మరో ఎస్సెట్.. ఇక కధ విషయానికి వస్తే ప్రపంచంలో ఒకే తల్లి కడుపున పుట్టకపోయిన ఒకే రూపంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒకచోట కలిస్తే .. వారిలో ఒకడు దుష్టుడు అయితే మిగతా ఇద్దరి పరిస్థితి ఏమిటి ?అన్న విభిన్న కధాంశంతో నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఈ సినిమాను రూపొందించాడు.. హైదరాబాద్లో సిద్ధార్థ్ ( కళ్యాణ్ రామ్) హైదరాబాద్ లో తల్లిదండ్రులతూ ఉంటూ తండ్రి వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు సిద్ధార్థ్ ఒక వెబ్ సైట్ లో తన పేరు చేర్చి తనలాగే ఎవరయినా ఉన్నారేమో అని చూసుకుంటాడు. అచ్చం తన రూపురేఖలతో వున్న మరో ఇద్దరు వ్యక్తులు, మైఖేల్ (కళ్యాణ్ రామ్), మంజునాథ్ హెగ్డేలను (కళ్యాణ్ రామ్) కలుస్తారు. ముగ్గురూ గోవా లో కలుద్దాం అనుకోని అక్కడ కలుస్తారు, కానీ ఇలా ముగ్గురు ఒకే రూపురేఖలతో ఉన్నట్టు ఎక్కడా బయటకి చెప్పరు. ఇంతలో ఒక ట్విస్ట్ మైఖేల్ అనే అతని అసలు పేరు బిపిన్ అని, అతను ఒక మాఫియా డాన్.. అతనిలా వున్న మిగతా ఇద్దరు అతని ప్లాన్ లో ఎలా ఇరుక్కున్నారు? అన్నది వెండి తెరపై చూడవలసిందే.. సినిమా మొదటి భాగం కొంచెం డల్ గా ఉన్నప్పటికీ సెకండ్ పార్టీ బాగుంది. చివర క్లైమాక్స్ అదిరింది. కళ్యాణ్ రామ్ 3 పాత్రలలో బాగా నటించాడు. బ్రహ్మజీ కామిడి బాగా కుదిరింది. దర్శకుడు మరికాస్త శ్రద్ధగా సినిమా తీసి ఉంటె సూపర్ హిట్ కొట్టేవాడంటున్నారు. బాలయ్య పాట ఎన్నో రాత్రులు .. రీమిక్స్ బాగా కుదిరింది. సో.. సినిమా చూడవచ్చు ..
