సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: జనవరి 27వ తేదీ లోకేష్ పాదయాత్ర రోజు గుండెపోటు తో కుప్పకూలిన ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న (40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత 3వారాలుగా మృత్యువుతో పోరాడి అలసిన తారకరత్న మృతికి నందమూరి అభిమానులతో పాటు అందరిని కలచివేసింది. ప్రధాని మోడీ కూడా తన సంతాప సందేశం విడుదల చేసారు. హైదరాబాద్ లో తారక రత్న నివాసానికి ( ఇటీవల 3 నెలల క్రితం కొత్తగా నిర్మించుకొన్నారు) చేరుకొన్న ఆయన పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ ,సన్నిహిత బంధువు ఎంపీ విజయసాయి రెడ్డి , జూ. ఎన్టీఆర్, కల్యాణరామ్ తో సహా పలువురు ఘన నివాళ్లు అర్పించారు. తారకరత్న23 సినిమాలలో నటించారు. అందులో 2009 లో వచ్చిన ‘ అమరావతి’ సినిమాలో విలన్ పాత్ర కు ఉత్తమ విలన్ గా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకొన్నారు. అందరు సినీ ప్రముఖులు సంతాప సందేశాలు , వ్యక్తిగతంగా వచ్చి నివాళ్లు అర్పిస్తున్నారు. పాదయాత్ర లో ఉన్న నారాలోకేష్ కూడా తన సంతాప సందేశము విడుదల చేసారు. రేపు సోమవారం ఫిల్మ్ నగర్ లో అభిమానుల కడసారి చూపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *