సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజకీయాలకు అతీతంగా తెలుగు వారి ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రంలో వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళ్లు ఘటించారు. నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి, లక్ష్మి పార్వతి , జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో సహా ఇతర కుటుంబ సభ్యులు, నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలదండ వేసి నమస్సులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. తెలుగువారి ఘనకీర్తి.. తెలుగువారికి స్ఫూర్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య.. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని, ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని, ఎన్టీఆర్ పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని పేర్కొన్నారు సంక్షేమ పథకాలతో పేదల జీవితాలను మార్చిన నేత ఎన్టీఆర్ అని కీర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *