సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని నందమూరి గరవులో ఇటీవల కోట సత్తెమ్మ దేవాలయం వద్ద జరిగిన జాతర నేపథ్యంలో ఇద్దరు యువజన సంఘాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో కాసాని సతీష్ అనే 17 ఏళ్ల యువకుడిని కక్ష కట్టిన ప్రత్యర్థి వర్గం తాజగా దారి కాసి కొట్టడంతో అతను గాయాలతో ఇంటికి రావడంతో అతనిని ఆసుపత్రికి చేర్చడం తదుపరి చికిత్స పొందుతూ మరణించాడని సమాచారం.. వీరవాసరం పోలీసులు దాడి చేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోని ఆ యువకుడి మృత దేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్థం నిర్వహించారు. ఒక్కగాని ఒక్క కొడుకుని కోల్పోయామని ఆ కుటుంబ సభ్యులు రోదనలతో గ్రామంలో విషాదం అలముకొంది. ఆ యువకుని మిత్రులు మీడియా తో మాట్లాడుతూ.. తమ మిత్రుడిని కొట్టి అతని చావుకు కారణమైన వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు అని మమ్ములను ఏమి చెయ్యలేరని సవాల్ చేసారని ఆరోపిస్తున్నారు. అసలు వాస్తవాలు.. పోలీస్ దర్యాప్తు తరువాత పూర్తీ వివరాలు అందవలసి ఉంది. నందమూరు గురువు గ్రామంలో ఉద్రిక్తతలు తెలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు.
