సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం నియోజక వర్గం, వీరవాసరం మండలం, నందమూరుగరువు గ్రామంలో ప్రతిష్టాకరంగా జరిగే శ్రీ శ్రీ శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వార్షికోత్సవాలు అంటే జిల్లాలో తెలియనివారు ఉండరు. ప్రతి ఏడాది 11 రోజులు పాటు భారీ సెట్టింగ్స్, లైటింగ్, భారీ ఎగ్జిబిషన్ లతో, నాటక ప్రదర్శనలతోఅంగరంగ వైభవంగా జరిగే .. 56 వ ఉత్సవాలలో భాగంగా నూతన ఉత్సవ విగ్రహం హంస వాహనం ఆవిష్కరణ కార్యక్రమంలో,స్వామివారి ఊరేగింపులో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా పరిషత్తు చైర్మెన్, కవురు శ్రీనివాస్ లు స్థానిక భక్తులతో కలసి ఉత్సహపూరితంగా పాల్గొన్నారు. మహిమానీతంగా భావించే శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వారికీ ప్రత్యక పూజలు నిర్వహించి , ఉత్సవ కమిటీ నిర్వాహకులను అభినందించారు.
