సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి సమీపంలోని నందమూరు గరువులో మహిమానిత శ్రీ అంజనేయ స్వామివారి శ్రీ హనుమద్రత్వ 57వ వార్షిక మహోత్సవాలు ఈ డిసెంబర్ నెల 5వ తేదీ నుండి ప్రారంబిస్తున్నారు. ఆ రోజు ఉదయం 7గంటలకు కలశస్థాపన నిర్వహించి తదుపరి 8 గంటలకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అనంతరం ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వేలాదిగా ప్రజలు 11 రోజులు పాటు డిసెంబర్ 15వ తేదీవరకు జరిగే ఈ ఉత్సవాలకు హాజరు అవుతారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలానే భారీ సెటింగ్స్ , లైటింగ్ అలంకరణలు, స్వామివారికి , దేవాలయాలయానికి నూతన రంగుల అలంకరణలతో, పాటు నాటకాలు, సాంప్రదాయ ప్రదర్సనలు, సినీ, సంగీత కళాకారులతో వేడుకలు నిర్వహించేందుకు భారీ వేదిక కూడా సిద్ధం అవుతుంది. అలాగే ఆబాల గోపాలాన్ని అలరించడానికి చిరు స్టాల్స్, భారీ ఎగ్జిబిషన్ కూడా దేవాలయ ఆవరణలో శరవేగంగా సిద్ధం అవుతుంది.
