సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త ఏడాది వస్తుంది. పైగా సంక్రాంతి పండుగకు సంప్రదాయాల పేరుతొ కోడిపందాలతో సహా జూదాలకు, మందు వ్యసనాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎంత సందడిగా ఉంటుందో డబ్బు ఎలా చేతులు మారుతుందో అందరికి తెలిసిందే.. ఇదే అదనుగా ఫేక్ కరెన్సీ మార్చే వారికీ ఇదే మంచి సీజన్.. అందుకే నకిలీ కరెన్సీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలులో కొందరు సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో కొందరు మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోతారని , అలాంటి వారి వలలో ఎవరు పడకండి అని హెచ్చరిస్తున్నారు. చిన తిరుమలగా ప్రసిద్ధి చెందిన ద్వారకాతిరుమలలో తాజగా నకిలీ కరెన్సీ మార్చడానికి మోసగాళ్లు చేసిన విఫల యత్నం వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తికీ రూ. 2.50 లక్షలకు రూ. 15 లక్షలు నకిలీ కరెన్సీ ఇచ్చేటట్లుగా ఒప్పందం కుదుర్చుకుని, డబ్బు చేతులు మారుతున్న సమయంలో నకిలీ కరెన్సీకి బదులు టాయ్ క్యాష్ ఇస్తున్నట్లుగా ఆ బాధితుడు గుర్తించాడు. పారిపోవడానికి యత్నించిన దుండగులలో స్థానికులు ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇదే తరహా ఘటన మచిలీపట్నంలో ఒక బ్రాందీ షాప్ వద్ద జరుగగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
