సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడులో ఘరానా మోసం జరిగింది. దీనితో ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఒక ఉన్నత కుటుంబాల తరహా లుక్ ఇస్తూ ఓ మహిళ బంగారు పూత వేసిన నకిలీ ఆభరణాలను తెచ్చి స్థానిక జ్యూయలరీ షో రూమ్ లో ఇచ్చి వాటికీ కొంత అదనపు మొత్తం చెల్లించి అసలైన బంగారు నగలను తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆమె ఇటీవల భీమవరం, నర్సాపురం, పాలకొల్లులలో పలు బంగారు షాపులలో నగలు మార్పిడి చేసినట్లు తెలుస్తోంది. నగలు కరిగించగా బంగారంలో రాగి ఎక్కువగా ఉందని గుర్తించిన షాపుల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌లలో సదరు మహిళ ఫోటో, వీడియోలను వ్యాపారస్తులు ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె నిన్న , ఆకివీడులో స్థానిక బంగారపు షాపులో నగలు మారుస్తుండగా మహిళను షాపు యజమాని ఆమెను అడ్డుకొని పోలీసులకు పిర్యాదు చేసారు అయితే మహిళ మాత్రం మోసాన్ని అంగీకరించకపోగా.. తాను ఆ పాత నగలను ఆన్లైన్ షాపింగ్ చేసినట్టు చెబుతూ.. తనకు కృష్ణ జిల్లాలో టీడీపీ బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి బాగా తెలుస్తునని హడావిడి చెయ్యగా సదరు మహిళ కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
