సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని ప్రముఖ బ్యాంకులలో నకిలీ పత్రాలు భూములను హామీగా చూపి బ్యాంకులో కోట్ల రూపాయల మొత్తంలో రుణాలు తీసుకోని ఎగవేసిన వైట్ కాలర్ నేరాలపై సిబిఐ , సీఐడీ అధికారులు గతంలో పలు దర్యాప్తులు చేసిన ఘటనలు విదితమే.. తరువాత ఆ డబ్బులో కొంత రికవరీ కావడం.. తరువాత కేసులు లో కొందరు క్రింద స్థాయి అధికారులపై చర్యలతో సరిపెట్టడం తెలిసిందే.. అయితే తాజగా మరో విషయం వెలుగులోకి వస్తుంది.. గత 2 రోజులుగా …నకిలీ పత్రాలతో 100 కోట్ల పైగా ‘రుణాలు తీసుకొన్నట్లు’ భావిస్తున్న పెద్ద మనుష్యుల విషయంపై ప్రముఖ బ్యాంకులో భీమవరంలో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. జిల్లాకు చెందిన కొంతమంది వారికీ సంబంధం లేని రైతుల భూములు తమవిగా చూపుతూ నకిలీపత్రాలతో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం లోని ఒక బ్యాంకు నుండి 2016 లో కోట్లాది రూపాయలు రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు భూములు గల అసలు రైతులకు నోటీసులిచ్చారు. దీంతో కంగారుపడ్డ రైతులు బ్యాంకుకు వెళ్లగా అసలు మోసం ?వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. వీరిలో భీమవరం పట్టణానికి చెందిన కొంతమంది పెద్దలు ఉన్నారని తెలిసింది. ఇదే తరహాలో…కొద్దీ నెలల క్రితం గణపవరం లోని ఒక ప్రముఖ బ్యాంకు ను మొగళ్తూరు లో చేపల చెరువుల పత్రాలు పెట్టి కొందరు మోసగాళ్లు కోట్ల రూపాయలు రుణాలు తీసుకోని ఎగవేస్తే.. అధికారుల దర్యాప్తులో అక్కడ చెరువులు లేవు అవన్నీ మామిడి తోటలు అని అసలు రైతులు లబోదిబో అన్న విషయం ఇక్కడ గమనార్హం.
