సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పడు రాష్ట్రంలో ఎక్కువమంది ప్రజలు ద్రుష్టి ఏపీ శాసనమండలి పైనే..అయితే చైర్మన్ మోషేను రాజు కు ఇటీవల మండలి సమావేశాలు నిర్వహించడం కత్తిమీద సాము చేస్తున్నట్లు ఉంది. ‘తిరుమల లడ్డు నెయ్యి వివాదం’లో అటు అధికార పక్షం కూటమి మంత్రులు ఇటు విపక్షం వైసీపీ సీనియర్ నేతలు మధ్య తీవ్ర మాటలా యుద్ధం కంట్రోల్ చెయ్యడానికి సమన్వయంతో పాటు ఇరు పక్షలు నేతలపై, మంత్రులపై కూడా కాస్త కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. నేడు, శుక్రవారం కూడా సభలో మరోసారి గందరగోళ పరిస్థితి నెలకొంది.లడ్డు నెయ్యి ఫై చర్చ జరగకుండా ప్రభుత్వం స్టేట్మెంట్ లు ఇస్తూ అడ్డుపడుతోందని.. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఛైర్మన్ సభను వాయిదా వేశారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం మొదలైన వెంటనే నిన్న(గురువారం) జరిగిన సంఘటనపై ఛైర్మన్ రూలింగ్ ఇచ్చారు. ‘నిన్న లడ్డూ ప్రసాదంపై లఘు చర్చ సందర్భంగా ( మంత్రి పయ్యావుల కేశవ చూపిన పత్రం రిప్లై మాత్రమేనని,తాను ఇచ్చిన స్టేట్మెంట్ కాదని చైర్మెన్ మోషేను తేల్చి చెప్పారు.) తప్పుడు పత్రం చూపించి సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇరుపక్షాలు సభ సజావుగా జరిగేలా సహకరించాలి’ ఛైర్మన్ అన్నారు. ఛైర్మన్ రూలింగ్‌పై మంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలుపగా.. మరింత మాట్లాడి తనను అవమానపరచాలని అనుకుంటున్నారా? అని ఛైర్మన్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి.. అచ్చేమ్ నాయుడు ‘మాకు మీరంటే అపారమైన గౌరవం ఉంది’ అని స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ నెయ్యి అంశంపై ఎన్ని రోజులైనా చర్చించడానికి తాము సిద్ధమని కూడా మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
