సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నేటి , శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదని అయితే బీసీలు అధికారంలో ఉన్నవారిని రాజ్యా ధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. ఇంత బలం ఉన్నపటికీ ఇన్నే ళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. గతం నుండి బీజేపీ పార్టీ తో జనసేన పొత్తు కొనసాగుతుంది. ఈ మిత్ర బంధముతో .. తెలంగాణ రాష్ట్రంలో 26 కులాలను బీసీల జాబితా నుండి తొలగించడం పై ,అన్యాయంపై బీజేపీ తో పాటు వైసిపి , టీడీపీ కూడా స్పందించాలి. బీసీలకు జనసేన అండగా ఉంటుంది. నన్ను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారు. నేను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదు. ప్రజలం దరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నా.. ఇటీవల నా అభిమానులే నాకు ఓటు వెయ్యరు అన్న ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇవ్వని నా అభిమానులలో బీసీలలో పట్టుదల పెంచి రాజకీయాలలో జనసేన పార్టీ పాత్ర ఎంత కీలకమైనదో గుర్తించాలని కోరారు.
