సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ లాబీలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నేడు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అటు గత వైసీపీ ప్రభుత్వం పైన ఇటు ప్రస్తుత తమ ఎన్డీయే కూటమి ప్రభుత్వ తీరుపైనే కీలక వ్యాఖ్యలు చేసారు.చింతమనేని మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా 27 కేసులు పెట్టి వేధించారని అన్నారు. మరో టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డిపై 14 అక్రమ కేసులు నమోదు అయ్యాయి. అన్నారు. నిన్న రెండు కేసులను న్యాయస్థానం తప్పని కొట్టేసిందన్నారు. మరో 25 అక్రమముగా పెట్టిన కేసులు తనపై ఉన్నాయన్నారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టిన అధికారులంతా ఇప్పటికి ఎక్కడెక్కడో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నన్ను వేధించిన అధికారులే కావాలంటూ మా నాయకులే వారికి మంచి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాల విలువ తీసేసేలా అక్రమ కేసులతో చట్టాన్ని వైసీపీ దుర్వినియోగం చేసిందని విమర్శించారు. నిన్న తనపై కొట్టేసిన రెండు కేసులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేసి పెట్టినవే అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *