సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఆడియోనునేడు, సోమవారం వైట్ హౌస్.మీడియాకు విడుదల చేసింది. ఆ ఆడియోలో ఏముందంటే..‘ అమెరికాతో భారత్ వాణిజ్య లావాదేవీలుతనకు మాత్రమే అనుకూలంగా కొనసాగిస్తోంది. ఇలాగె కొనసాగితే భారత్ వాణిజ్య లావాదేవీలపై త్వరలో మరిన్ని సుంకాలు పెంచుతా. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ప్రధాని మోదీకి కూడా తెలుసు. నన్ను సంతోషపెట్టడం భారత్‌కు చాలా ముఖ్యం’ అని వ్యాఖ్యలు చేసారు. కాగా, ఇప్పటికే భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించింది. ఇందులో 25 శాతం టారిఫ్‌లు కేవలం రష్యాతో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న కారణంగా కక్ష తో విధించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో భారత్ అమెరికా తో బైలటెరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ (బీటీఏ) చేసుకోవాలని చూస్తోంది. అతి త్వరలో ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని, ఆ ఒప్పొందం కోసమే ట్రంప్ హడావిడి అని విశ్లేషకులు భావిస్తున్నారు.
