సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం పవిత్ర గురు పౌర్ణమి నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు ప్రజలు కు ఆయురారోగ్యాలు ప్రసాదించే పచ్చని పకృతి దేవత ‘శాఖంబరి దేవి’గా అలంకరణ లో దర్శనమిచ్చారు. దేవాలయంలో ఉప దేవాలయం శ్రీ వినాయక విగ్రహం మొదలుకొని శ్రీ అమ్మవారి దేవాలయం లో నలువీధుల ఎంతో శ్రమకు ఓర్చి ఎన్నో టన్నుల కూరగాయలు ఆకూ కూరలతో పండ్లతో విభిన్న పుష్పాలతో చేసిన అలంకరణ నభూతో నభవిషత్ అన్న రీతిలో అలంకరించారు. ఇక పండ్లు పుష్పాలతో నిలువెత్తు శ్రీ అమ్మవారు అయితే వనదేవత ను తలపించారు. సకల సుఖశాంతులు అందించే శాఖంబరి దేవిని వేలాదిగా భక్తులు విశేషంగా కుటుంబ సమేతంగా దర్శించుకొంటున్నారు. అందమైన చిట్టి అడవిని తలపించేలా తీర్చిద్దిన అలంకరణలతో ఉన్న ఆలయంలో విహరించడం ఒక ఆధ్యాత్మిక మధురానుభూతి ని మిగులుస్తుంది. నేడు, రేపు శుక్రవారం కూడా శ్రీ శాఖంబరీదేవి దర్శనాలు భక్తులు కు ఉంటాయి. దేవాలయ ఆవరణంలో వేద పండితులు చండి హోమం కూడా ఘనంగా నిర్వహించారు. దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
