సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో ఆక్వా వ్యవసాయంలో అగ్రగామికి బాసిల్లు తున్న పశ్చి మగోదావరి జిల్లాకు జగన్ సర్కార్ ప్రతిష్టాకరంగా తీసుకొన్న జాతీయ స్థాయి ఆక్వా యూనివర్సిటీ తరగతులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. విశ్వ విద్యా లయం కోసం నరసాపురం మండలం లిఖితపూడి గ్రామంలో ప్రభుత్వం సేకరించిన 50 ఎకరాల్లో రోడ్ల నిర్మాణ పనులు పూర్తీ చేస్తున్నారు. ఆక్వా విశ్వ విద్యా లయం ఏర్పాటుకు ప్రభుత్వం రూ.338 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా రూ.100 కోట్లు మంజూరుచేసింది. తరగతి గదులు, కార్యా లయం , 400 మంది బాలురు, బాలికల ఉండేందుకు 24 వసతి గృహాలునిర్మించనున్నారు. 2023-24 విద్యా సంవత్సరం ఎంసెట్లో వచ్చి న ర్యాంకుల ఆధారంగా బీఎఫ్ఎస్సీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సు )మొదటి ఏడాది ప్రవేశం కల్పిం చనున్నా రు. తరగతికి 46 సీట్లు కేటాయించారు. జాతీయ స్థాయిలో ఆరు, ఎంసెట్ ర్యాంకు ఆధారంగా 40 సీట్లు భర్తీ చేస్తారు. బీఎఫ్ఎస్సీ కోర్సు నాలుగేళ్లు. భవిష్యత్తులో పీజీ, పీహెచ్డీ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. విశ్వ విద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ ఏడాది తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.ఆక్వా విశ్వ విద్యాలయానికి అనుబంధంగా బియ్యపుతిప్ప లో 350 ఎకరాలను సేకరిస్తున్నారు.
