సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రంలో ఈ నెల 19న రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు యోగా రాష్ట్ర కార్యదర్శి ఎన్‌. చంద్రశేఖర్‌ తెలిపారు. యోగ కు మరింత ప్రజాదరణ , అందరికి ఆరోగ్యదాయక జీవితం కలగాలనే ఉద్దేశ్యంతో ఈ పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రోత్సహక బహుమతులు కూడా ఉంటాయన్నారు. ఎనిమిది నుంచి 80 ఏళ్ల లోపు యోగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొనవచ్చునన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ మాజీ జిల్లా గవర్నర్‌ కోట్ల రామ్‌కుమార్‌, మహిళా కళాశాల కరస్పాండెంట్‌ నూలి శ్రీనివాస్‌, కేంద్రం కన్వీనర్‌ బాబుశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *