సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: ఆక్వా పరిశ్రమలో రాష్ట్రానికి ఎగుమతుల ఆదాయం లో సింహభాగం పశ్చిమ గోదావరి జిల్లా దే .. అందుకే ఇదే ప్రాంతంలో మత్యశాఖ చెందిన అందరు నిపుణులను తయారు చేస్తే ఆక్వా పరిశ్రమ మరింత వేల కోట్ల రూపాయలు ఆదాయం సాధిస్తుందనే దూరదృష్టి తో నరసాపురంలో ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలో తొలి ఫిషరీస్ యూనివర్సిటీకి జగన్ సర్కార్ నిధులు మంజూరు చేసింది. ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ విశ్వవిద్యాలయానికి తొలి విడతగా రూ.100 కోట్లు మంజూరు చేసింది. నరసాపురం మండలం తీరగ్రామం వేములదీవి ప్రాంతంలో 400 ఎకరాల్లో వర్సిటీ నిర్మాణం కోసం స్థలం సేకరించారు. పరిపాలన భవనాన్ని 40 ఎకరాల్లో సమీపంలోని సరిపల్లి గ్రామంలో నిర్మిస్తున్నారు. దీనితో ఇటు భీమవరం జోన్ కు, అటు కృష్ణ జిల్లా కు, మరోవైపు కోనసీమ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. విశ్వవిద్యాలయం నిర్మాణం, కోర్సుల నిర్వహణ, ప్రయోగాలు తదితర అంశాలకు ఐదేళ్లలో రూ.400 కోట్ల వరకూ ఖర్చుచేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. . ఈ విశ్వవిద్యాలయం ద్వారా నూతన పరిశోధనలకు, ఆక్వా రంగం అభివృద్ధికి వర్సిటీ దోహదం చేస్తుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. up file photo
