సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం గోదావరి తీరంలో బాపు ఘాట్ వద్ద మూతపడిన ఏపీ టూరిజం రెస్టారెంట్, బోట్స్ క్లబ్ ను తిరిగి ప్రారంభించడానికి తాజగా నోటిఫికేషన్ జారీచేశారు. మంచి లొకేషన్ లో లక్షలాది రూపాయలతో దీనిని నిర్మించినప్పటికీ గత నాలుగేళ్ల నుంచి రెస్టారెంట్‌తోపాటు పర్యాటకులకు వినోదాన్ని ఇచ్చే బోట్లు కొరత , నిర్వహణ వైఫల్యం కారణంగా దీనిని మూసివేశారు. మరల ఏపీ టూరిజం ఈ రెస్టారెంట్ ను తెరిచేందుకు సిద్ధం అవుతుంది. దీనిలో భాగంగా ఈ నెల 24న పర్యాటక శాఖ కార్యాలయంలో టెండర్ ఫారాలను అమ్ముతున్నారు. టెండర్ ఫారం రూ.5 వేలు, ఏడాది అద్దె రూ.7 లక్షలుగా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు టెండర్లను తెరవనున్నట్లు జిల్లా పర్యాటక శాఖ తెలిపింది.
