సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో మూడు రోజుల క్రితం మధ్యాహ్నం బయట వర్షం పడుతున్న వేళా.. బ్యాంకులో అందరూ మహిళలే ఉన్నవేళ ఎస్‌బీఐ బజారు బ్రాంచిలో సిబ్బందిని ఒక వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకొని సినిమా తరహాలో కత్తితో బెదిరించి రూ 6.50 లక్షలు చోరీ చేసాడు. నిజానికి అతడు 7న్నర లక్షలు చోరీ చేసి తీసుకొనివెళ్తుండగా రెండు 500 నోట్ల కట్టలు హడావిడిలో బ్యాంకులోనే పడిపోయాయి. సిసి ఫుటేజిలో అంతా రికార్డు అయ్యింది. ఈ చోరీ కేసును ఛేదించినట్లు తాజగా జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో నిందితుడు తానేటి సురేషబాబును అరెస్టు చేశామన్నారు. నిందితుడు స్వస్థలం నర్సాపురం మండలం రుస్తుం బాధ గ్రామం అని తెలిపారు. నిందితుడి నుంచి రూ 6.50 లక్షలు నగదు, కత్తిని స్వాధీనం చెసుకున్నట్లు ఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు.
