సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేడు, గురువారం పర్యటించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస రాజు తో కలసి స్థానిక బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో మద్యం షాపులు ముట్టడి కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు మద్యం షాపుల వద్ద మద్యం బాటిల్స్ పగులగొట్టి తన నిరసనను ప్రదర్శించారు. ఏపీలో మహిళలు పుస్తెలు తెగిపోతున్న సరే మద్యం అమ్మకాలు పెంచుతున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతాం అని పురంధేశ్వరి అన్నారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. మద్యం, మట్టి, ఇసుక మాఫియా నడుస్తోంది. భూకబ్జా లు, స్కామ్ లు చేస్తున్న ఆడిగేదెవరన్నట్లు వ్యవహారిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం.అని ఆరోపించారు. మహిళ బిల్లు కోసం ప్రధాని నరేంద్రమోడీ కృషి చేస్తుంటే.రాష్ట్రంలో జగన్ మద్యం విక్రయాలుకోసం తహ తహ లాడుతూ జేబులు నింపుకుంటున్నారు. రాష్ట్రంలో దశలు వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన సీఎం జగన్ మద్యం బాండ్లు పై 10.77 లక్షలు కోట్లు అప్పులు ఎలా చేశారు.అని విమర్శించారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *