సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నుండి వశిష్ఠ గోదావరిపై రామేశ్వరం (కోనసీమ) నరసాపురం మండలం రాజుల్లంక వద్ద వారధిని సుమారు 600 కోట్ల అంచనా వ్యయం తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సుమారు 900 మీటర్ల మేర అప్రోచ్‌ రోడ్‌తో చేపట్టే ఈ పనులకు ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపింది. తాజాగా వశిష్ఠ వారధి నిర్మాణ పనులకు శరవేగం గ అడుగులు పడుతున్నాయి. దీనిలో భాగంగా రోడ్డు పనులకు రైతుల వద్ద సేకరించిన పొలాలకు కేంద్ర ప్రభుత్వం రూ.60 కోట్లు నిధులు విడుదలయ్యాయి. అందుకు పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులకు రూ.31 కోట్లు ఇవ్వనున్నారు. మిగతావి కోనసీమ జిల్లా రైతులకు ఇస్తారు. ఇప్పటికే నిధులు విడుదల కావడంతో ఎమ్మెల్యే ముదునూరి, సబ్‌కలెక్టర్‌ సూర్య తేజలు అధికారులు తాజగా లక్ష్మణేశ్వరం గ్రామంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే ముదునూరి, సబ్‌కలెక్టర్‌ సూర్య తేజలు పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే లక్ష్మణేశ్వరం, రాజుల్లంక, సీతారాంపురం, వైఎస్‌ పాలెం, రామన్నపాలెం పంచాయతీల్లో 54.30 ఎకరాలను 309 మంది రైతుల నుంచి సేకరించారు. డాక్యుమెంట్స్ ఇచ్చిన రైతుల ఖాతాల్లో కేంద్రం విడుదల చేసిన పరిహారం సొమ్ము జమకానుంది. తూర్పు గోదావరి జిల్లా దిండి నుంచి నరసాపురం మండలం సీతా రాంపురం వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర 216 బైపాస్‌ జాతీయ రహదారిని నిర్మించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *