సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గణేష్ నిమజ్జన వేడుకల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గత ఆదివారం సాయంత్రం నిమజ్జనానికి తీసుకోని వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్ మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు రెండు నిమిషాలు కిందకు దిగారు. దానితో మరో ఆకతాయి యువకుడు నేర్చుకోవడానికి ట్రాక్టర్ నడపగా అది అదుపుతప్పి ట్రాక్టర్ ముందు వెళుతున్నవారిపై దూసుకెళ్లి స్పాట్‌లోనే నలుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి క్షేమం కోసం డాక్టర్స్ కు తగిన సూచనలు ఇచ్చారు. ఇదిలా ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా వినాయక నిమజ్జనంలో జాతీయ రహదారి నుంచి అతివేగంతో వచ్చిన ఎస్‌యూవీ థింసా నృత్యం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో స్పాట్‌లోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
