సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం కేసు ముడి వీడింది. విజయవాడ ఏలూరు కాల్వలో గత 6రోజులుగా గాలిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు గత మంగళవారం ఆయన భౌతికకాయాన్ని కనుగొన్నారు. కుమారులు సాయిరాం, మహీధర్‌ ఘటనా స్థలానికి వెళ్లి తమ తండ్రి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వాసు పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో వున్న నరసాపురం, పెన మలూరు ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్‌, బోడె ప్రసాద్‌, ఎంపీడీవో మృతదేహం లభ్యమైందన్న సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలా నికి వెళ్లి పార్ధిదేహానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ప్రభుత్వపరంగా అండగా ఉంటా మని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఎంపీ డీవో మృతి సమాచారం తెలిసిన ప్రజా ప్రతిని ఽధులు, సచివాలయ, పంచాయతీ సిబ్బంది నరసా పురం మండల పరిషత్‌ కార్యాలయానికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భముగా ఎంపీడీవో మృతికి కారుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు డిమాండ్‌ చేశారు. రేవు నిర్వహణదారు ధవేజీ, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆయనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారని, ఈ కారణంగానే ఎంపీడీవో అత్మహత్యకు పాల్ప డ్డారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *