సిగ్మాతెలుగు డాట్, ఇన్: న్యూస్: రేపటి ఆదివారం నుండి(ఈ నెల 26 నుంచి) భీమవరం మీదుగా వెళ్లే నరసాపురం–గుంటూరు మధ్య నడిచే ప్యాసింజర్ స్థానంలో ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు. 15 కోచ్‌లతో నడిచే ఈ రైలులో ఒక ఏసీ కార్ చైర్‌ను కూడా జత చెయ్యడం విశేషం. వీటితోపాటు రెండు నాన్ ఏసీ కార్ చైర్, పది జనరల్ బోగీలు, మరో రెండు బ్రేక్ వ్యాన్‌లు ఉంటాయి. 17282 నెంబర్‌తో ఉదయం 6.15 గంటలకు నరసాపురంలో బయలుదేరి11.45కు గుంటూరు వెళుతుంది. మరల తిరిగి ప్రయాణంలో సాయంత్రం 4.45కు అక్కడ బయలుదేరి రాత్రి 10.30కు నరసాపురం వస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ గోదావరి జిల్లా లో పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, ఉండి, ఆకివీడు స్టేషన్లలో ఆగుతుంది. ఇప్పటికే ఈ రైలు బోగీలన్నీ నరసాపురం స్టేషన్‌కు చేరుకున్నాయి. ఆన్‌లైన్, బుకింగ్ కౌంటర్లలో రిజర్వేషన్‌ను చేసుకోవచ్చును.. రెండు నెలలుగా నరసాపురం – సికింద్రాబాద్ మధ్య ఆదివారాల్లో భీమవరం మీదుగా నడుపుతున్న స్పెషల్ రైలును వచ్చే జనవరి నెలలో ఐదు ఆదివారాల్లో కూడా ప్రస్తుత షెడ్యూల్ సమయాల్లోనే ఈ రైలు నడవనుంది.
