సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం హైవే ఇన్ ఫంక్షన్ హల్ లో జరిగిన నరసాపురం నియోజకవర్గ గౌడ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిని గూడూరి ఉమాబాల, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తో పాటు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా విశేషంగా హాజరు అయిన గౌడ నేతలు మాట్లాడుతూ.. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సమాన లబ్ధిని మరియు ఇప్పటి వరకు అధికార పరంగా వెనుకబడి ఉన్న బిసి లకు రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం జగన్ మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎంపీ అభ్యర్థిగా ఉమాబాల ను ఎమ్మెల్యే గా ప్రసాదరాజు ను గెలిపించుకోవాలని ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
