సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజగా విడుదల చేసిన ట్విట్ లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు నిధులు కేటాయించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన రెండ్రోజుల్లోనే రూ.1.74కోట్లు మంజూరు చేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని పవన్ మెచ్చుకొన్నారు. ఈ మేరకు డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి చేసిన నరసాపురం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇది సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి, అధికారుల వృత్తి నిబద్ధతకు నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
