సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత పది నెలలుగా చేసిన కృషి ఫలించిందని, చెన్నై నుండి నరసాపురం వరకు తోలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే శాఖ నేడు, శుక్రవారం ఆమోదం తెలిపిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రకటించారు. త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించనుందని ఆయన తెలిపారు. ​భీమవరంలో జరిగిన బీజేపీ ‘సారథ్యం’ సభ సమయంలోనే కేంద్ర రైల్వే మంత్రి కార్యాలయం నుంచి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు ఫోన్ ద్వారా నరసాపురం – చెన్నై వందే భారత్‌కు ఆమోదం లభించినట్లు సమాచారం అందింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ రెండు జోన్‌ల మధ్య సమన్వయం చేసి, సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ అద్భుతమైన కృషి చేశారని కొనియాడారు. ​కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ చొరవతో నరసాపురంలో వాటర్ ఫిల్లింగ్ సర్వీస్ ఏర్పాటు చేసి, ఈ ప్రాజెక్టుకు ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించారని బీజేపీ నాయకులు తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితులలో వందే భారత్ రైలు కు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో ఆగే విధంగా హల్ట్ సాదించవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *