సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం పట్టణం అల్లూరి కళ్యాణమండపంలో నేడు, బుధవారం నూతన మార్కెట్ యార్డ్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మార్కెట్ యార్డ్ నూతన కమిటీ చైర్మన్ గా గుబ్బల రాధాకృష్ణ,వైస్ చైర్మన్ గా కటికల సూర్యారావు, డైరెక్టర్లుగా ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయం నర్సాపురం నియోజకవర్గంలో జరుగుతుందన్నారు.మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అంటే ఒక బాధ్యత గల పదవని,నియోజకవర్గ ఎమ్మెల్యే తర్వాత అంతటి ప్రోటోకాల్ ఉన్న పదవి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అని అన్నారు.రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందని అన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవుల్లో మొదటి రెండు సంవత్సరాలు ఎస్సీలకు కేటాయించగా మూడో సంవత్సరంలో బీసీలకు కేటాయించడం స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మంచితనానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ ,ప్రసాదరాజు మాట్లాడుతూ ..బీసీలకు పెద్దపీట వేస్తూ నర్సాపురం నియోజకవర్గంలో కీలక పదవులను బీసీలకు కేటాయించామని అన్నారు. గత పాలకవర్గం సుమారు 12 కోట్ల రూపాయలతో నరసాపురం నియోజకవర్గంలో 18 తారు రోడ్లకు మంజూరు ఇచ్చిందని,టెండర్ ప్రక్రియ పూర్తయిందని కొత్త పాలకవర్గంలో ఆ పనులన్నింటినీ పూర్తి చేస్తామని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ , కౌరు శ్రీనివాస్ డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకట స్వామి, తదితరులు పాల్గొన్నారు.
.
