సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి 11 గంటల సమయంలో మొంథా తుఫాన్ పశ్చిమ గోదావరి నరసాపురం మీదుగా 90 కిమీ వేగంతో తీరందాటింది. దాని ప్రభావంతో భారీ పెనుగాలులు నర్సాపురం, పాలకొల్లు, భీమవరం,అంతర్వేది, కోనసీమ జిల్లా మీదుగా విజృంభించాయి. అక్కడ సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అయితే వర్షం మాత్రం పెద్దఎత్తున కాకుండా కాస్త కనికరించింది. గత రాత్రి 7న్నర గంటలకే అన్ని దుకాణాలు దేవాలయాలు మూసి వెయ్యడంతో ఎక్కడ ప్రాణ నష్టాలు జరగలేదు. పోలీసులు, జిల్లా అధికారులు విద్యుత్తూ ఉద్యోగులు మునిసిపల్ సానిటరీ , కేబుల్ టివి, ఇంటర్నెట్ వాళ్ల, బాగా శ్రమించారు ముందు జాగ్రత్తలు తీసుకొన్నారు. దీనితో ఆస్తి నష్టాలు బాగా తగ్గాయి. అనేక చెట్లు విరిగి పడటం, చెట్లు విద్యుత్తూ స్తంబాలు వంగిపోవడం జరిగింది. భీమవరం మండలం గ్రామాలలో ప్రజలు సముద్ర తీరా ప్రాంతలలో తుపాను నష్టాలు ఎక్కవ చవిచూశారు. పట్టణం శివారు ప్రాంతాలలో గాలుల తీవ్రత కు ఇంటిలో నీటి బిందెలపై వేసుకొన్న మూతలు కూడా ఎగిరిపడ్డాయని చెపుతున్నారు. నరసాపురం విద్యుత్తూ సరఫరా నిలచిపోయింది. భారీ వర్షాలు పడ్డాయి. భీమవరంలో నిన్న రాత్రి 8 గంటల నుండి భీమవరం లో విద్యుత్తూ సరఫరా పూర్తిగా పునరుద్ధరించారు. అయితే మరల తెల్లవారు జాము నుండి ఆపుతూ వస్తూ కొనసాగిస్తున్నారు. నేటి బుధవారం ఉదయం కూడా పెనుగాలులు తో వాతావరణం ముసురు కమ్ముకొంది, నేడు కూడా పట్టణంలో అన్ని దుకాణాలు తెరువలేదు.. హోటల్స్ మూసిఉన్నాయి. క్రమంగా తుపాను బలహీనపడుతున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
