సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి నరసాపురం లో దశాబ్దాలుగా లేసు కుటీర పరిశ్రమకు అక్కడి విభిన్న అల్లికలు ఉత్పత్తులకు దేశ విదేశాలలో మంచి డిమాండ్ ఉంది. అయితే తాజగా జాతీయ స్థాయిలో నరసాపురం లేస్‌ ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు లభించింది. లేస్‌కు కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఒన్‌ డిస్ర్టిక్‌ ఒన్‌ ప్రోడక్ట్‌) అవార్డు ప్రకటించింది. 2024–25 సంవత్సరానికి నరసాపురం అల్లికకు గుర్తింపు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల ఉత్పత్తులు పోటీపడగా 7 జిల్లాల ఉత్పత్తులను ఎంపిక చేయగా నరసాపురం లేస్‌ అల్లికలు ప్రథమంగా ఎంపికయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదానంలో, గత సోమవారం సాయంత్రం కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ను కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ చేతులమీదుగా జిల్లా కలెక్టర్‌ నాగరాణి గత సోమవారం సాయంత్రం అవార్డును అందుకొన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ తరచూ పార్కును సందర్శించి మహిళలతో సమావేశమవుతున్నారు. వారి ఆదాయాలు మరింత పెరగడానికి కొత్త డిజైన్లు, అల్లికలపై శిక్షణ గురించి తెలిపి మార్కెటింగ్‌ కు మరిన్ని మార్గాలు తెరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *