సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మెట్టునిల్లు గా కలిగిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ లా సీతారామన్ బుధవారం పార్లమెం ట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ప్రత్యేక కేటాయింపులు ఏమి లేకపోవడం నిరాశ పరుస్తుంది. ఆఖరికి జిల్లాలోని ప్రతిష్టాకర ‘పోలవరం జాతీయ ప్రాజెక్టు’ గురించి అసలు ప్రస్తావనే లేకపోవడం జిల్లా వాసులను నివ్వెరపరిచింది. ఇక దేశంలో అందరికి వర్తించే 7 లక్షల లోపు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెం పుపై జిల్లాలో సుమారు 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. దీనితో ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు, పీఎం ఆవాస్ యోజన ప్రకటనపై ఇళ్లు నిర్మించుకునేవారు కొంత సంతృప్తికరంగా ఉన్నారు. ఇక పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షల మం ది రైతులున్నారు. ఇందులో నాలుగు లక్షల మంది వరకు కౌలు రైతులు.బడ్జెట్లో ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల రుణాల్లో.. జిల్లా రైతులకు దాదాపు రూ.5 వేల కోట్ల వరకు అందనుంది. ఇక పం టలకు మద్దతు ధర ఊసే లేకపోవడం అన్న దాతలను నిరాశపరిచింది.
