సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగ కరెన్సీ నోట్ల చెలామణి కేసులు పలు నమోదు కావడంతో నరసాపురం జోన్ ఇటీవల బాగా ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతానికి పొరుగున గోదావరి అవతల కోనసీమ గ్రామాలూ ఉండటం అక్కడ గల్ఫ్ తదితర విదేశాలలో పనిచేసేవారు ఉండటం, మరోప్రక్క నరసాపురం సరిహద్దులలో భీమవరం తో కలసి సముద్ర తీరా ప్రాంతం ఉండటం ఈ ప్రాంతాలలో ఆక్వా, జ్యూవెలరీ వ్యాపారం దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందటంతో దొంగ నోటా మార్పిడి కి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కొందరు ప్రబుద్ధులు ఈ ప్రాంతాన్ని అనువుగా మార్చుకొంటున్నారు. ఇటీవల సంచలనము కలిగించిన నరసాపురం యాక్సిస్ బ్యాంకులో ఈ నెల 7న ఎటిఎం లోరూ.20 వేలు విలువ గల 40 రూ.500 నకిలీ నోట్లను డిపాజిట్ చేసిన నేపథ్యంలో.. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ కె.రవిమనోహరచారి మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం.. దర్యా ప్తులో నిందితులుగా గుర్తిం చిన కళ్యాణబాబుతోపాటు అతని తండ్రి, స్థానిక వీఆర్వో పెద్దిరాజు, నందమూరు కాలనీకి చెందిన పడుచూరి భాస్క రరావు(42), అనకాపల్లి జిల్లా రోలుగుం ట మం డలం రాజన్న పేటకు చెందిన తేలు పుష్పాంజలి(24)లను అరెస్టు చేశామని, వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు కారు స్వాధీనం చేసుకొన్నామని, అయితే ఈ కేసులో కీలక నిందితుడు పరారీలో ఉన్నాడని అతనిని అరెస్ట్ చెయ్యడానికి 2 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
