సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఎస్సీ అభ్యర్థికి సీటు కేటాయించాలని దళిత సంఘాల రాష్ట్ర నాయకులు గంటా సుందర్ కుమార్ భీమవరంలో డిమాండ్ చేశారు. స్థానిక రాజ్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరసాపురం పార్లమెంట్ లో ఎస్సీలకు ఒక్క రిజర్వ్ సీటు లేదని, దళితులకు గానీ దళిత క్రైస్తవులకు గానీ కేటాయించాలని, అన్ని పార్టీలతో పాటు వైఎస్సార్ సిపి పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. రాజ్యాంగ బద్దంగా రావాల్సిన రిజర్వేషన్స్ మాత్రమే మేము అడుగుతున్నామని, దళితులు దళిత క్రైస్తవులు వైఎస్సార్ సిపి జెండాలు మోస్తున్నారని, జెండాలు మోసే వారిగానే మిగిలిపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. 2014లో వంకా రవీంద్రనాథ్, 2019 కనుమూరి రఘురామ కృష్ణంరాజు కు దళితులు, దళిత క్రైస్తవులు అండగా నిలిచారని, ఈ ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఎస్సీ దళిత క్రైస్తవులకు కేటాయించాలని కోరుతున్నామని, పార్లమెంట్ లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేదని, అందుకే ఎంపికి అడుగుతున్నమని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి దృష్టికి నేతలందరికి తెలియజేస్తామని, స్పందించన పక్షంలో నా అభ్యర్థి పోటీ చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో యేలేటి న్యూటన్, గుడిపాటి శాంత రావు, అనితా రాణి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *