సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భూమి ఫై గతంలో 45 అడుగుల ఎత్తువరకు భారీ ఆకారాలలో తిరుగాడిన రాక్షసి బల్లులు( డైనోసార్స్) విషయాలు అంటే ఇప్పటి తరానికి ఎంతో ఆసక్తి . మరి భారత భూభాగం నర్మదా నది తీరంలో సుమారు 6.6 కోట్ల సం వత్సరాల క్రితం భూమి మీద తిరుగాడిన డైనోసార్ల గుడ్లను, గూళ్లను గుర్తించినట్లు ఢిల్లీ విశ్వ విద్యా లయం , ఇం డియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యు కేషన్, రీసెర్చ్ కు చెం దిన శిలాజ శాస్త్రవేత్తలు తాజగా ప్రకటించారు. ఈ వివరాలు పీఎల్ఓఎస్ ఒన్ జర్నల్లో ఈ వారం ప్రచురితమయ్యాయి. ఇప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న బాగ్, కుక్షి ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో పొడవాటి మెడతో ఉండే శాకాహారులైన టైటానోసార్లకు చెందిన 256 గుడ్లు, పలు గూళ్లు బయటపడ్డాయి. ఇక్క డ లభించిన గుడ్లన్నీ బహుళ పెం కులతో నిర్మి తమై ఉం డడాన్ని వారు గమనించారు. అంటే ఒకనాడు నర్మద తీరం లో డైనోసార్లు విశేషంగా సంచరించేవి అన్న మాట..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *