సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురంలో రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సరిపల్లి, లికితపూడి మధ్య సుమారు 500 ఎకరాల్లో వర్సిటీ పరిపాలనా భవన నిర్మాణం సిద్ధం చేస్తుండగా మరో ప్రక్క వర్సిటీలో 140 పోస్టుల నియామకానికి మొన్న కాబినెట్ లో సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. వర్సి టీ పరిపాలనా వ్య వహారాల నిర్వహణకు సంబంధించి వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ వంటి 65 కీలక, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధన, బోధనేతర సిబ్బంది కలిపి 75 పోస్టులు మొత్తంగా 140 మంది నియామకానికి ఆమోదం లాభించింది. అలాగే రానున్న 2023–24 విద్యా సంవత్సరంలోవర్సిటీలో కోర్సులు ప్రారంభించాలని కూడా నిర్ణయిం చారు. మొదటి సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీష్ సైన్స్, మాస్టర్ఆఫ్ ఫిషరీష్ సైన్స్ కోర్సులు ప్రారంభం కానున్నాయి. దాదాపు రూ.600 కోట్లతో వచ్చే ఐదేళ్లలో నిర్మించనున్న వర్సిటీ నిర్మాణాలకు గతేడాది సీఎం జగన్ శంకుస్థాపన చెయ్యడం గమనార్హం… అలాగే రూ.100 కోట్లను తొలి విడతగా ప్రభుత్వం కేటాయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *