సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. నర్సాపురం లో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదని, దేవుడి దయతో రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం అన్నారు. నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం, ఈ ప్రాంతానికి ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నరు. ఆక్వా కల్చర్ సుస్థిర అభివృ ద్ధికి కట్టుబడి ఉన్నాం. దేశంలో 3వ ఫిషరీష్యూనివర్శిటీని నర్సాపురంలో రూ.332 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నాం ’’ అని సీఎం జగన్ అన్నారు. నేను విన్నాను.. నేను.. ఉన్నాను.. అని చెప్పి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నాం. నర్సాపురంలో దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం ’’ అని అన్నారు. టీడీపీని తెలుగు బూతుల పార్టీగా, జనసేనను రౌడీసేనగా మార్చేశారని విమర్శించారు. గతంలో చంద్రబాబు కూటమి పాలన చూసి ప్రజలు ఇదే కర్మ రా బాబు అనుకున్నారు. ప్రజలకు అసలు ఏ మంచీ చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారని బాబు చెప్పడు. చంద్రబాబు, దత్తపుత్రుడు, పచ్చ మీడియా వాళ్ళు ప్రజలకు మంచి జరిగితే సహించలేకపోతున్నారు అని విమర్శించారు,
