సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీ వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.చెట్లు విరిగిపడుతున్నాయి. ప్రభుత్వం అన్ని విద్య సంస్థలకు నేడు, మంగళవారం కూడా సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం కాకినాడకు 270 కి.మీ దూరంలో ఉన్నతుపాన్ గోదావరి జిల్లాల మీదుగా ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉండటంతో వంద కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో భారీ వర్షం కురుస్తుందని అటు, వాతావరణ శాఖ కూడా అప్రమత్తం చేసింది. బహుశా నరసాపురం కాకినాడ కు మధ్య లో తుపాను తీరం దాటుతుందని,(మచిలీపట్నం కు కూడా ఛాన్స్ ఉందని) వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనితో భీమవరం కలెక్టర్ కార్యాలయం నుండి పరిస్థితి పర్యేకిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను పోలీస్ యంత్రాగంను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నారు. జిల్లాలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, భారీ పెనుగాలులు వీస్తుండటం తో ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని హెచ్చరికలు చేసారు.ప్రజలకు ఆహారం, వైద్యం, తరలింపు తదితర సాయం చెయ్యడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భీమవరం నర్సాపురం తీరా ప్రాంతంలో భీమవరం తీరా ప్రాంతాలలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా కంట్రోల్ రూమ్ 98816 299181 కు ప్రజలు తెలియపరచాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *