సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నర్సీపట్నం కృష్ణబజార్ సెంటర్లో నేడు, ఆదివారం తెల్లవారుజామున స్థానిక అంబికా జ్యూవెల్లర్స్లో భవనంలో షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగాయి.ఈ అగ్ని ప్రమాదంలో తండ్రి కొడుకు సజీవదనం కావడం పెద్ద విషాదం, విషయంలోకి వెళ్ళితే .. పాత భవనంలో ఉంటున్న అంబికా జ్యూవెల్లర్స్లో పైఅంతస్తులో షాపు ఓనర్స్ మల్లేశ్వరరావు కుటుంబం నివాసం ఉంటోంది. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగా భవనంలో మంటలు భవనాన్ని పూర్తిగా కమ్మివేయడంతో మల్లేశ్వరారావు, ఆయన కుమారుడు మౌలేష్ అక్కడే సజీవ దహనమయ్యారు. మిగిలిన భార్య కుమార్తె ఇద్దరు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
