సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు పాలంగి రోడ్లోని శ్రీభమిడి సూరన్న లే అవుట్లో శ్రీఉమా రామలింగేశ్వర ట్రస్ట్ (నెలమూరు) ఆధ్వర్యంలో ఆప్తవాజపేయమ్ (శరద్వాజ పేయమ్) మహయాగాన్ని నిర్వహిస్తున్నట్లు యాగ నిర్వాహకులు జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కు ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమ వివరాలను ప్రకటించారు. శ్రీచండీ, మహారుద్ర పూర్వక కోటి దీపోత్సవ, కోటి కుంకుమార్చన సహిత మహాయాగాన్ని నిర్వహిస్తున్నామని, ఇది 80వ యాగమాని, గత మే 15న భీమవరంలో 79వ అతిరాత్ర మహాయగాన్ని చేపట్టామని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భారతదేశం కర్మభూమి, పుణ్యభూమి. అనేక కోట్ల లక్షల వేల సంవత్సరముల నుండి అనేక మంది మహనీయులు మునులు, యోగులు, సిద్ధులు, ఋషుల తపోశక్తిచే పాదస్పర్శచే పునీతమైన భూమి అని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *