సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సీనియర్ హీరోయిన్ జేజమ్మ.. అనుష్కశెట్టి తదుపరి చిత్రం అధికారికంగా తాజాగా ప్రకటించారు. గతంనుండి జాతిరత్నాలుతో భారీ హిట్టుకొట్టిన నవీన్ పోలిశెట్టి హీరోగా, అనుష్క కథానాయికగా ఓ సినిమా రాబోతోందనే వార్తలు వినిపించాయి. దీనికి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారని కూడా అనుకున్నారు. అయితే ఈ రోజు, ఆదివారం నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ పై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. నవీన్ కు విషెస్ తెలుపుతూ… ఈ ప్రాజెక్ట్ లో అనుష్క కథానాయికగా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వయస్సు రీత్యా ఇద్దరి మధ్య ఉన్న తేడాతోనే ఇదో విచిత్ర ప్రేమకథ చిత్రంగా భావిస్తున్నారు,ఈ సందర్బంగా ఓ ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *