సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉగాది సంధర్భంగా నేడు, మంగళవారం నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల, జగదీష్ దంపతులు DCCB చైర్మన్ మరియు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి PVL నరసింహరాజు తో వీరవాసరం మండలం, నవుడూరు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పద్దాల వెంకమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా విచ్చేసిన వేలాది భక్తులను స్వయంగా కలుసుకోవడం వారికీ జరిగిన అన్నసమారాధన లో పాల్గొనడం జరిగింది. అయితే యాదృచ్చికంగా భీమవరం జనసేన ఎమెల్య అభ్యర్థి పులపర్తి అంజిబాబు అక్కడ కు రావడం ఒకరికి ఒకరు ఎదురు కావడంతో ఒకరికి ఒకరు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకొని కొద్దీ సేపు మాట్లాడుకొన్నారు. ఆహ్లాదంగా కుశల ప్రశ్నలు వేసుకొన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఉమాబాల జగదీష్ దంపతులను అంజిబాబు అభినందించారు. రాజకీయాలు పార్టీల వరకే.. ఇదే తీరు కార్యకర్తలు లో కనిపిస్తుండటం ఇటీవల భీమవరం పరిసర రాజకీయాలలో ఆరోగ్య పరిణామం..
