సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం వీరవాసరం మండలం నవుడూరు గ్రామం మృత్యుంజయనగర్ లో రజకుల చెరువు వద్ద శ్రీవద్దల వెంకమ్మ ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు దృష్టికి స్థానిక రైతులు తమ పంట పొలాలకు వెళ్లే రహదారి ఆక్రమణలకు గురైందని తెలిపారు. దానితో ఎమ్మెల్యే, అంజిబాబు వెంటనే ఫోన్లో అధికారులతో మాట్లాడారు. రైతుల పొలాలకు వెళ్లే రహదారులను ఆక్రమణలకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లను ఆక్రమించిన వారిచే చర్యలు తీసుకోని ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. నవుడూరు గ్రామస్తులు విశేషంగా వచ్చి ఎమ్మెల్యే కు తమ సమస్యలు చెప్పుకొన్నారు.
