సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న నేడు వరుసగా 2 రోజులు దేశి స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. యూకే-భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావం చూపించాయి. దీంతో ఈ వారాన్ని సూచీలు నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలను చవిచూశాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా భారీగా నష్టాలను చవి చూశాయి. గత గురువారం ముగింపు (82, 184)తో పోల్చుకుంటే నేడు శుక్రవారం ఉదయం నష్టాలతోనే మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 721 పాయింట్ల నష్టంతో 81, 463 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 225 పాయింట్ల నష్టంతో 24, 837 వద్ద ముగిసాయి.
