సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఈవారం భారత్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి నేడు, బుధవారం ఉదయం సెన్సెక్స్ 1,000 పాయింట్లు(సుమారు 1 శాతం మేర) పడిపోయి.. ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి 81,124.45ని తాకింది. భారతీయ స్టాక్ ఎక్సేంజి నిఫ్టీ సుమారు 250 పాయింట్లు క్షీణించి.. 25,000 స్థాయిని సమీపించింది. ఇది ఇంట్రాడేలో కనిష్ఠ స్థాయి 24,919.80ని కు చేరుకొంది.
