సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం తాజాగా నాంపల్లిలో చెన్నయి నుండి వచ్చిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ప్లాట్‌పారం సైడ్ వాల్‌ను ఢీకొంది. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్టు ప్రాధమిక సమాచారం.దీంతో ట్రాక్ మీద నుంచి కిందకి జరిగిన రైలు బోగీలు కాస్త పట్టాలు తప్పాయి. అప్పటికే రైల్లోని ప్రయాణికులు మిగతా స్టేషన్స్ లో దాదాపు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 50 మందికి గాయాలయ్యాయి. ఆందోళనకు గురియైన కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో పాటు వృద్దులకు గుండె దడ వచ్చినట్టు సమాచారం.(ఫై తాజా చిత్రంలో పట్టాలు మీద తప్పుకున్న ట్రైన్ )
