సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నోబెల్ శాంతి బహుమతి సాధించి తీరాలని. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నేడు, శుక్రవారం నోబెల్ అవార్డ్స్ కమిటీ గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ నామినేషన్ తమకు నియమిత సమయానికి అందలేదని తెలిపింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ టార్గెట్ చేశారుఈరోజు ఆ అవార్డుల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మీడియాతో దీని గురించి మాట్లాడారు. గాజాతో పాటూ ప్రపంచంలో శాంతి నెలకొల్పానని ఆయన చెప్పుకున్నారు. భారత్ పాకిస్తాన్ ల యుద్ధంతో సహా ఎనిమిది యుద్ధాలను ఆపానని మరోసారి పునరుద్ఘాటించారు. నోబెల్ శాంతి బహుమతి తనకు కచ్చితంగా రావాల్సిందేనని అన్నారు. అయితే అవార్డు రాకపోవడంతో ట్రంప్ తన సహజ ధోరణిలో తన అవార్డును ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఏమీ చేయని ఒబామా లాంటి వారికి నోబెల్ ఇచ్చారు. ఎందుకిచ్చారో అతనికి కూడా తెలియదు.. అమెరికాకు రెండుసార్లు అధ్యక్షుడిగా ఉన్న ఒబామా బహుశా అమెరికాను నాశనం చేసినందుకు ఇచ్చి ఉంటారని ఒబామా గురించి వ్యాఖ్యలు చేశారు. కానీ నేను ఎనిమిది యుద్ధాలను ఆపడంలో విజయం సాధించానని అన్నారు. ఇలాంటిది ఇంతకు ముందు ఎవరూ చేయలేదని అయిన నేను ఆ అవార్డ్ కోసం ఏమీ చేయలేదు. ప్రజల ప్రాణాలు కాపాడ్డానికే యుద్ధాలను ఆపానని ట్రంప్ తనకు తాను సర్ది చెప్పుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *