సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీలోనే కొనసాగుతూ ఎప్పడు విజయవాడ ఎంపీగా తన స్వతంత్ర ప్రత్యేకత ను చాటుకొనే కేశినేని నాని కి మరో 3 నెలలు లో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో తిరిగి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారు. ఈ విషయం ను సోషల్ మీడియాలో విజయవాడ ఎంపీ కేశినేని నాని స్వయంగా ప్రకటించడం గమనార్హం.. ఇంకా చాల బహిరంగంగా ఆయన .. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గత గురువారం సాయంత్రం టీడీపీ నేతల ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని బహిరంగంగా ప్రకటించారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా తనకు కాకుండా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. దీనితో కృష్ణ జిల్లాలో కీలకనేత అయిన కేశినేని నాని తదుపరి ఎటువంటి నిర్ణయం తీసుకొంటుంటారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే 2వర్గాలుగా ఉన్న కృష్ణ జిల్లా టీడీపీ క్యాడర్ మధ్య మరిన్ని తగాదాలకు ఆస్కారం ఏర్పడింది. తిరువూరు సభ విషయంలో గత బుధవారం నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాలు మధ్య వివాదం చెలరేగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *