సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం మరోసారి లోక్ సభలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లు సూటిగా తిరుగులేని ప్రశ్నలతో, కాస్త వెటకారం జోడించి అధికార ఎన్డీయే పెద్దలకు చుక్కలు చూపించారు. గత 10 ఏళ్లుగా తక్కువ సంఖ్యలో ఉన్న ప్రతిపక్షాలను తన వాగ్ధాటితో ఆడేసుకొన్న ప్రధాని మోడీ కి ఈ సమావేశలలో మాత్రం రాహుల్ దూకుడు చూసి మాటలు మర్చిపోయారు అని చెప్పాలి. నేడు పార్లమెంటులో ఈవీఎంల (EVMs) అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈవీఎంల విశ్వసనీయతను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచిన సరే,, మరోసారి 80 సీట్లు గెలిచినా సరే తాను ఈవీఎంలను నమ్మేది లేదని అన్నారు. వాటిని నిలుపుదల చేసే వరకు పోరాటం తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కొందరి వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించినట్టు ఆయన తీవ్రంగా ఆరోపించారు. అయితే ఆ వివరాల్లోకి తాను వెళ్లదలచుకోలేదని చెప్పారు. ఈవీఎంల అంశం తెరమరుగు కాలేదని, సమాజ్‌వాదీ పార్టీ దీనిపై పట్టుబడుతూనే ఉంటుందని అన్నారు. NEETపరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై కూడా అఖిలేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వమే ఆ పని చేస్తోంది. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణం” అని అఖిలేష్ విమర్శించారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమిని ప్రస్తావిస్తూ, బహుశా అది రాముడి అభిమతం కావచ్చని అన్నారు. అయోధ్యలో విజయాన్ని పరిపక్వ భారతీయ ఓటర్ల ప్రజాస్వామిక విజయంగా ఆయన అభివర్ణించారు. 400 సీట్లు గెలుచుకొంటానని ప్రకటించిన బీజేపీ ని ప్రజలు తిరస్కరించారని నైతికంగా ఇండియా కూటమికి విజయం అందించారని .. ఇక ఏంతో కాలం కేంద్రంలో మోడీ పాలన జరగదని జోస్యం చెప్పారు.
