సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సినిమాలలో సరైన హిట్ లేక వెనుకపడ్డ అక్కినేని నాగచైతన్య తొలిసారిగా నటించిన వెబ్‌సిరీస్ ‘దూత’ ను అక్కినేని కుటుంబం తో ‘మనం’ వంటి సూపర్ హిట్ ( ఇదే అక్కినేని హీరోలకు 6ఏళ్ళ క్రితం వచ్చిన ఆఖరి సూపర్ హిట్ మూవీ)అందించిన విజయ్ కుమార్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించింది. గత సంవత్సరమే విడుదల కావలిసిన ఈ సిరీస్ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడగా మళ్లీ ఇన్నాళ్లకు ఓటిటి లో ప్రదర్శనకు వచ్చింది. ఈ క్రమంలోనే నాగ చైతన్యతో ప్రమోషన్స్ ప్రారంభిచడమే కాక సిరీస్, ట్రైలర్ విడుదల తేదీలను ప్రకటించి నేడు, గురువారం నాగచైతన్య జన్మదినం సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘లెక్కపెట్టలేనన్ని వాస్తవాలు, చెప్పలేని రహస్యాలు వాటిని కనుగొనేందుకు ఓ వ్యక్తి చేసిన పోరాటం ఇది’ అంటూ సిరీస్ గురించి క్లుప్తంగా వివరించారు. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ ట్రైలర్ చూసిన వారికి సిరీస్ తప్పక చూడాల్సిందే అన్నట్టుగా ఈ ట్రైలర్ ను వదిలారు.
