సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరల కూటమి నేతల్లో రాజ్యసభ ఉప ఎన్నికల పోటీ మొదలైంది. ఇటీవల ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో మరి, మూడు సీట్లను టీడీపీ వారే తీసుకొంటారని మొదట అనుకున్నప్పటికీ వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని సమాచారం… మూడు పార్టీల కూటమి సమానంగా ఒకొక్కరి చప్పున సీట్లు తీసుకోవాలని ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో 2 రాజ్యసభ స్థానాలకు ఇంకా 4 ఏళ్ళు పదవి కాలం , ఒక స్థానానికి కేవలం 2 ఏళ్ళ పదవి కాలం మాత్రమే ఉన్నాయి. దీనిలో బాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు బయటకు వచ్చింది. గతంలో కూటమి కలయిక కోసం తన అనకాపల్లి జనసేన ఎంపీ సీటు త్యాగం చేసిన నాగబాబు కు రాజ్యసభ సీటు కచ్చితంగా వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక మరో సీటు .. ఇటీవల రాజ్యసభకు రాజీనామా చేసిన మాజీ వైసీపీ నేత బీద మస్తాన్‌రావే.. మళ్లీ ఈ టీడీపీ తరపున సీటును దక్కించుకోబోతున్నట్టు సమాచారం . ఇక మరో సీటు బీజేపీ కి ఇస్తారో లేదా టీడీపీ గల్లా జయదేవ్ లేక అశోక గజపతిరాజు కు కోసం తీసుకొంటుందా? చూడాలి…
